ఎనిమిది నెమళ్ల మృతి

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం శివారులోని దేవిలాల్‌తండాలో ఎనిమిది నెమళ్లు మృతి చెందినట్లు శుక్రవారం అటవీ రేంజి అధికారి సదానందం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పొలాల్లో నెమళ్లు మృతి

Published : 29 Jan 2022 04:23 IST

వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో ఘటన

పర్వతగిరి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం శివారులోని దేవిలాల్‌తండాలో ఎనిమిది నెమళ్లు మృతి చెందినట్లు శుక్రవారం అటవీ రేంజి అధికారి సదానందం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పొలాల్లో నెమళ్లు మృతి చెందినట్లు తండావాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అటవీ అధికారులు సిబ్బందితో వెళ్లి ఆరు ఆడ, రెండు మగ నెమళ్ల మృతదేహాలను గుర్తించారు. పర్వతగిరి పశువైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌ వాటికి పోస్టుమారం నిర్వహించి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెమళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. బర్డ్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందాయా?, పురుగుల మందులు కారణమా? అనేది తేలాల్సి ఉంది. సమీప భూముల రైతులను అటవీ అధికారులు విచారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని