
ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్స్ ఏంటో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: కొద్ది రోజుల క్రితం గూగుల్ ఆండ్రాయిడ్ 11 పేరుతో కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడుదల చేసింది. యూజర్స్‌కి మరింత చేరువ కావడమే లక్ష్యంగా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ని ఇందులో పరిచయం చేశారు. తాజాగా గూగుల్ తన ఆండ్రాయిడ్ యాప్స్‌లో మార్పులు చేస్తూ కొత్త ఫీచర్స్‌ని జోడించింది. ఇప్పటికే పలువురు యూజర్స్‌కి అందుబాటులో ఉన్న ఈ ఫీచర్స్ త్వరలో పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది. మరి ఆ ఫీచర్స్ ఏంటి? ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందామా!
యాప్‌లకు గూగుల్ అసిస్టెంట్
ఇన్నాళ్లూ గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ని బేసిక్ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించేవాళ్లం. ఇక మీదట వాయిస్ అసిస్టెంట్‌తో ఆండ్రాయిడ్ యాప్స్‌కు కూడా కమాండ్స్ పంపొచ్చు. ఉదాహరణకు ఓకే గూగుల్ చెక్ మై అకౌంట్ ఇన్ మింట్ అని కమాండ్ ఇవ్చొచ్చు. అలా యాప్స్‌లో మనకు కావాల్సిన పనులను సులభంగా గూగుల్ అసిస్టెంట్ సహాయంతో చక్కబెట్టొచ్చు.
గూగుల్ డ్యుయోలో ఆటోమేటిక్ క్యాప్షన్
ఇక నుంచి గూగుల్ డ్యూయోలో వీడియో కాల్స్ చేసినప్పుడు ఫొటోలు, స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు వీడియో కాల్ మాట్లాడే సమయం లేకుంటే అవతలి వ్యక్తులు మీ కోసం వీడియో మెసేజ్ పంపొచ్చు. ఇందులో వినికిడి లోపం ఉన్న వారి కోసం ఆటోమేటిక్ క్యాప్షన్ ఫీచర్ కూడా ఉంది. సాధారణ యూజర్స్ కూడా ఆడియో వినే అవకాశం లేనప్పుడు మెసేజ్ అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అలర్ట్‌గా ఉంచే సౌండ్ నోటిఫికేషన్స్
గూగుల్ కొత్తగా లైవ్ ట్రాన్స్క్రైబ్ యాప్‌లో సౌండ్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇది వినికిడి లోపం ఉన్నవారు లేదా సాధారణ వ్యక్తులు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు చుట్టుపక్కల ఏవైనా సంఘటనలను జరిగినప్పుడు మనల్ని అలర్ట్ చేస్తుంది. ఉదాహరణకు మన చుట్టుపక్కల ఫైర్ అలారమ్ మోగినా, ఎవరైనా ఇంటి తలుపు కొట్టినా, ఇంట్లో ఉపయోగించే వొవెన్, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు పని పూర్తయినప్పుడు వచ్చే శబ్దాలను గుర్తించి ఫోన్ ఫ్లాష్ అవ్వడం, వైబ్రేషన్, పుష్ నోటిఫికేషన్స్‌ను ఇస్తుంది.
స్పామ్ కాల్స్‌కి చెక్
తరచుగా మనల్ని వేధించే స్పామ్ కాల్స్‌కి చెక్ పెడుతూ గూగుల్ ఫోన్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక మీదట స్పామ్ కాల్స్‌ని ఆపి వాళ్లు ఎవరు, ఎందుకు చేస్తున్నారు వంటి వివరాలను గూగుల్ ముందుగానే యూజర్స్‌కి తెలియజేస్తుంది. ఆండ్రాయిడ్ 9 ఆపై ఓఎస్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ ఫీచర్‌ను సేవలను పొందవచ్చు.
వారి కోసం యాక్షన్ బ్లాక్స్
వయసు రీత్యా వచ్చే ఇబ్బందులతో బాధపడేవారితో పాటు, మానసిక వైకల్యం కలిగిన వ్యక్తులు యాక్షన్ బ్లాక్స్ ద్వారా తక్కువ పదాలతో సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సెరిబ్రల్ పాల్సి, డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, అఫాసియా వంటి వాటితో పాటు మాట్లాడటంలో సమస్యలు ఉన్నవారి కోసం ఈ యాప్‌లో మార్పులు చేశారు. వారి కోసం ఇందులో కమ్యూనికేషన్‌ని తెలియజేసే వేల రకాల సింబల్స్‌ను కొత్తగా జోడించారు. ఇప్పటికే ఇందులో స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ టీవీ
గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీ యాప్‌ని గూగుల్ టీవీగా అప్డేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో స్ట్రీమింగ్ యాప్స్‌లో సినిమాలు, షోల జాబితాను ఇది మీకు సూచిస్తుంది. అంతేకాకుండా యాప్‌లోని వాచ్‌లిస్ట్‌లో గూగుల్ ప్లే, గూగుల్ సెర్చ్‌లో మీరు బుక్‌మార్క్ చేసిన వాటి ఆధారంగా కంటెట్‌ను చూపిస్తుంది.