Updated : 27 Aug 2020 12:57 IST

పెద్ద బ్యాటరీ.. ₹13వేలలోపు ధర

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మార్కెట్లోకి వై20, వై20ఐ పేరుతో వివో రెండు బడ్జెట్‌ రేంజీ కొత్త ఫోన్లను విడుదల చేసింది. ప్రాథమిక ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఈ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ర్యామ్‌ మినహా ఈ రెండు ఫోన్ల మధ్య ఫీచర్ల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌ టచ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌‌తో ఈ మొబైల్స్‌ పనిచేస్తాయి. రెండింటిలోనూ 6.51 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్ ఎల్‌సీడీ‌ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వివో వై20 ఒబ్సిడియన్ బ్లాక్, డాన్ వైట్ కలర్స్‌లో వై20ఐ నిబులా బ్లూ, డాన్‌ వైట్ రంగుల్లో లభించనుంది. ధర విషయానికొస్తే వివో వై20 4జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర ₹ 12,999. వివో వై 20ఐ 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ధర ₹11,490. ఆగస్టు 28 నుంచి వివో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని