సైజు కొంచెం ఛార్జింగ్‌ ఘనం

ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు స్టఫ్‌కూల్‌ సరికొత్త ఛార్జర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు పికో ప్రో 35డబ్ల్యూ గాన్‌.

Published : 04 Jan 2023 00:21 IST

ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు స్టఫ్‌కూల్‌ సరికొత్త ఛార్జర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు పికో ప్రో 35డబ్ల్యూ గాన్‌. ప్రపంచంలో అతి చిన్న ఛార్జర్‌ ఇదేనని భావిస్తున్నారు. అలాగని పనితనంలో చిన్నదేమీ కాదు. అతివేగంగా ఛార్జ్‌ చేసేలా దీన్ని రూపొందించారు. పీఐ పోవిగాన్‌ అనే భవిష్యత్‌ టెక్నాలజీ దీని ప్రత్యేకత. పవర్‌ ప్లే స్టేషన్లు, పిక్సెల్‌ ఫోన్లు, మ్యాక్‌ బుక్‌ ఎం1, ఎం2, శామ్‌సంగ్‌, ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ఐఫోన్లనూ దీంతో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఎయిర్‌పాడ్స్‌ వంటి వాటినీ ఛార్జ్‌ చేసుకోవచ్చు. గాలియం నైట్రైడ్‌ (గాన్‌) పరిజ్ఞానంతో కూడినది కావటం వల్ల అతి వేగంగా ఛార్జ్‌ చేస్తుంది. ఒక టైప్‌-సి పోర్ట్‌ గల ఇది 35 వాట్స్‌ అవుట్‌పుట్‌ ఇస్తుంది. తెలుపు, లేత నీలం, పర్పుల్‌ రంగులతో ఆకర్షించే పికో ప్రో 35డబ్ల్యూ గాన్‌ కొన్ని ఆన్‌లైన్‌ అంగళ్లలో లభిస్తుంది.

తక్కువ ధరకే ప్రీమియం వాచ్‌

స్మార్ట్‌ఫోన్ల తర్వాత స్మార్ట్‌ వాచ్‌లను సొంతం చేసుకోవాలని ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. తక్కువ ధరలోనే ప్రీమియం లుక్‌తో ఆకర్షించే స్మార్ట్‌ వాచ్‌ల కోసమూ చూస్తున్నారు. ఇలాంటివారికి డిజో  వాచ్‌ ఆర్‌ మంచి ఎంపిక. సిల్వర్‌-మెటాలిక్‌ ఫినిష్‌, రెండు బటన్లు, 1.3 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 392 పీపీఐ పిక్సెల్‌ దీని సొంతం. 150కి పైగా వాచ్‌ ఫేసెస్‌, 110కి పైగా స్పోర్ట్‌ మోడ్స్‌ కలిగుంది. 260 ఎంఏహెచ్‌ బ్యాటరీతో గల దీన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది. కావాలనుకుంటే బ్లూటూత్‌తో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని