విశిష్టతల బెన్‌క్యూ వెబ్‌క్యామ్
చాలా ల్యాప్‌టాప్‌లు బిల్టిన్ కెమెరా కలిగుంటాయి. అయితే దీని రెజల్యూషన్ అంతంతే. ఇక్కడే యూఎస్‌బీ వెబ్‌క్యామ్ చేదోడుగా నిలుస్తుంది.
చాలా ల్యాప్‌టాప్‌లు బిల్టిన్ కెమెరా కలిగుంటాయి. అయితే దీని రెజల్యూషన్ అంతంతే. ఇక్కడే యూఎస్‌బీ వెబ్‌క్యామ్ చేదోడుగా నిలుస్తుంది. మరింత నాణ్యమైన వీడియో కాల్స్, ఆటోఫోకస్ వంటి ఫీచర్లకు వీలు కల్పిస్తుంది. తాజా బెన్‌క్యూ ఐడియాక్యామ్ ఎస్1 ప్రొ ఇలాంటిదే. దీన్ని కంప్యూటర్ మీదే కాదు, ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ మీదా పెట్టుకోవచ్చు, చేత్తోనూ పట్టుకోవచ్చు. దీని మ్యాక్రో లెన్స్ మరో ప్రత్యేకత. ఇది విడిగా వస్తుంది. దీన్ని కెమెరాకు అమర్చి, దృశ్యాన్ని 15 రెట్ల వరకు జూమ్ చేయొచ్చు. దీంతో వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎక్కువమందికి దృశ్యాలను చూపించటానికిది ఉపయుక్తంగానూ ఉంటుంది. ఉదాహరణకు- ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ప్రయోగాన్ని స్పష్టంగా వివరించటానికి వాడుకోవచ్చు. పీసీలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మదర్‌బోర్డు మీద భాగాలనూ జూమ్ చేసి చూపించొచ్చు. జూమ్ ఇన్, జూమ్ అవుట్‌కు రిమోట్ కంట్రోల్ ఉండటం విశేషం. కీబోర్డు వాడటం ఇష్టం లేని సమయాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుంది. కావాలంటే పుష్ బటన్‌తో జూమ్ చేసిన దృశ్యాన్ని నిశ్చలంగానూ ఉంచొచ్చు. ల్యాప్‌టాప్ మీద మౌంట్ చేసిన వెబ్‌క్యామ్‌ను 90 డిగ్రీల కోణంలో ముందుకు వంచితే, డెస్క్ మీదున్న దృశ్యాలూ కనిపిస్తాయి. బెన్‌క్యూ ఐడియాక్యామ్ ఎస్1 ప్రొలోని కెమెరా 3,264 2,448 పిక్సెల్స్ దృశ్యాలను సృష్టిస్తుంది. దీని నాయిస్ క్యాన్సెలేషన్ మైక్రోఫోన్ నాణ్యతా ఎక్కువే. సౌండ్‌నూ బాగా గ్రహిస్తుంది. అంతేకాదు.. ఎన్‌స్పైర్ యాప్‌తోనూ అనుసంధానమవుతుంది. దీంతో వైట్ బ్యాలెన్స్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, సాచ్యురేషన్, షార్ప్‌నెస్ వంటి వాటినీ సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ డేటాను ఆదా చేసుకోవటానికి రిజల్యూషన్‌నూ తగ్గించుకోవచ్చు. అయితే ఈ వెబ్‌క్యామ్ యూఎస్‌బీ-సితోనే కనెక్ట్ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత