పిక్సెల్‌ ఫోన్లలోనూ కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌

యాపిల్‌ అనంతరం గూగుల్‌ కూడా భారత్‌లో తమ పిక్సెల్‌ ఫోన్లలో ‘కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కారు ప్రమాదానికి గురైనప్పుడిది ఎంతగానో ఆదుకుంటుంది. ఒకప్పుడు ఈ ఫీచర్‌ అమెరికాకే పరిమితం. ఇప్పుడు భారత్‌తో పాటు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

Published : 08 Nov 2023 00:01 IST

యాపిల్‌ అనంతరం గూగుల్‌ కూడా భారత్‌లో తమ పిక్సెల్‌ ఫోన్లలో ‘కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కారు ప్రమాదానికి గురైనప్పుడిది ఎంతగానో ఆదుకుంటుంది. ఒకప్పుడు ఈ ఫీచర్‌ అమెరికాకే పరిమితం. ఇప్పుడు భారత్‌తో పాటు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్లలోని ఫీచర్‌ మాదిరిగానే ఇదీ పనిచేస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లకూ విస్తరించారు. కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ పేరుకు తగ్గట్టుగానే ఫోన్లలోని గ్రాహకాల సాయంతో పనిచేస్తుంది. కారు ప్రమాదానికి గురైతే హెచ్చరిక సందేశాన్ని పంపిస్తుంది. కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ సదుపాయం డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండదు. కాబట్టి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పిక్సెల్‌ ఫోన్‌ వాడుతున్నట్టయితే దీన్ని ప్రయత్నించి చూడొచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవటానికి..

  • ఫోన్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి, కిందికి స్క్రోల్‌ చేసుకుంటూ ‘సేఫ్టీ అండ్‌ ఎమర్జెన్సీ’ మీద తాకాలి.
  • ఇందులోని ‘కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌’ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

ఒకసారి ఎనేబుల్‌ చేసుకుంటే ప్రమాదాలను గుర్తించి, ఎమర్జెన్సీ సర్వీస్‌కు అలర్ట్‌ను పంపిస్తుంది. ఇలా సత్వరం సహాయం అందేలా చూస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని