వెనక తాకితే ఐఫోన్‌ టార్చ్‌లైట్

తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత. ఐఫోన్‌ చిట్కాల గురించి ఇలాగే చెప్పుకోవాలి. ఎంత తెలుసుకున్నా తెలియని చిట్కాలు ఇంకెన్నో. వీటిల్లో ఒకటి టార్చ్‌లైట్‌ ఫీచర్‌. మామూలుగా ఫ్లాష్‌లైట్‌ను ఆన్‌ చేయాలంటే లాక్‌ స్క్రీన్‌ మూలకు ఎడమ వైపున కనిపించే గుర్తును నొక్కుతారు. కంట్రోల్‌ సెంటర్‌ ద్వారానూ ఆన్‌, ఆఫ్‌ చేస్తారు.

Updated : 22 Dec 2021 05:25 IST

తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత. ఐఫోన్‌ చిట్కాల గురించి ఇలాగే చెప్పుకోవాలి. ఎంత తెలుసుకున్నా తెలియని చిట్కాలు ఇంకెన్నో. వీటిల్లో ఒకటి టార్చ్‌లైట్‌ ఫీచర్‌. మామూలుగా ఫ్లాష్‌లైట్‌ను ఆన్‌ చేయాలంటే లాక్‌ స్క్రీన్‌ మూలకు ఎడమ వైపున కనిపించే గుర్తును నొక్కుతారు. కంట్రోల్‌ సెంటర్‌ ద్వారానూ ఆన్‌, ఆఫ్‌ చేస్తారు. ఇందుకోసం సిరి కూడా ఉందనుకోండి. ఒక్క మాట సిరికి చెబితే వెంటనే ఫ్లాష్‌ లైటును ఆన్‌ చేసి పెడుతుంది. అయితే ఇంతకన్నా వేగంగా, తేలికగా దీన్ని ఆన్‌ చేసే చిట్కా మరోటి ఉంది. అదేంటో తెలుసా? ఫోన్‌ వెనక భాగాన తట్టటం. దీంతో స్క్రీన్‌ను తాకకుండానే లైటును వెలిగించొచ్చు. ఈ ఫీచర్‌ యాపిల్‌ ఐఫోన్‌ 8, ఆపై మోడల్స్‌లో అందుబాటులో ఉంది. దీనికోసం ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, యాక్సెసబిలిటీ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి. అందులోని ఫిజికల్‌, మోటార్‌ విభాగం కింద కనిపించే ‘టచ్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ‘బ్యాక్‌ ట్యాప్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేసి ‘డబుల్‌ ట్యాప్‌’, ట్రిపుల్‌ ట్యాప్‌’.. ఇలా మీరు ఎన్నిసార్లు ఫోన్‌ను తడితే లైట్‌ ఆన్‌ కావాలో అనేది నిర్ణయించుకొని, ఎంచుకోవాలి. తర్వాత సిస్టమ్‌ కింద కనిపించే ‘టార్చ్‌’ బటన్‌ను నొక్కాలి. అంతే. మీరు ఎంచుకున్నన్ని సార్లు ఐఫోన్‌ వెనక తడితే వెంటనే ఫ్లాష్‌లైట్‌ వెలుగుతుంది. ఫోన్‌కు కవర్‌ ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో బాగా ఉపయోగపడుతుంది. చూపు, వినికిడి లోపం, నాడీ జబ్బుల వంటివి గలవారి కోసం ఇలాంటి ఎన్నో ఫీచర్లను యాపిల్‌ ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని