Samsung Galaxy: ఫిబ్రవరిలో శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌

శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కి (Samsung Galaxy Unpacked Event) సన్నద్ధమవుతోంది.

Published : 23 Jan 2022 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కి (Samsung Galaxy Unpacked Event) సన్నద్ధమవుతోంది. ఏటా  శాంసంగ్ కంపెనీ తయారు చేసిన కొత్త మోడళ్లను ఈవెంట్‌ పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా శాంసంగ్‌ గెలాక్సీ కొత్త సిరీస్‌ ఫోన్లను ఫిబ్రవరిలో నిర్వహించే ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈవెంట్‌ ఎప్పుడు నిర్వహిస్తుందనే కచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేదు. ఈవెంట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లు, ట్యాబెట్లు, ఇతర ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ టీఎం రోహ్‌ తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. “ఫిబ్రవరి 2022లో అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటివరకూ సృష్టించిన అత్యంత ముఖ్యమైన గెలాక్సీ ఎస్‌ సిరీస్ మోడళ్లను ఈ ఈవెంట్‌లో విడుదల చేయనున్నాం” అని ఆయన పేర్కొన్నారు.


గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌

శాంసంగ్ కొత్తగా ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్‌22 మోడళ్లు అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గతేడాది వచ్చిన గెలాక్సీ ఎస్‌21  మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్, ఎస్22 అల్ట్రా మోడల్స్‌ను శాంసంగ్‌ విడుదల చేయనుంది. ఇందులో గ్లాస్‌ బ్యాక్ బాడీ, ఎస్‌-పెన్ ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఈ మోడల్స్‌లో కొత్త కెమెరా సెటప్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్సినోస్‌ 2200 (Exynos 2200) చిప్‌సెట్‌లను ఉపయోగించారు. ముందు కెమెరా 40 మెగాఫిక్సల్‌ను కలిగి ఉంటుంది. కాగా, ఈ మూడు మోడళ్లలో ధరల విషయంలోనూ వ్యత్యాసం ఉండనుంది.


గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8

శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో అల్ట్రా మోడళ్లలో రూపొందించిన గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8ను విడుదల చేయనుంది.  120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 14.6 అంగుళాల అమూల్డ్ డిస్‌ప్లేతో దీన్ని రూపొందించారు. దీనికి ముందువైపు రెండు 12 మెగాఫిక్సల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 16జీబీ ర్యామ్‌/512జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగిన ఈ ట్యాబ్‌ను ఈ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. అన్నీ ఎస్‌8 ట్యాబెట్లలో (స్టాండర్డ్‌, ప్లస్‌, ఆల్ట్రా) స్నాప్‌డ్రాగన్‌ 8 చిప్‌సెట్‌తో పాటు క్వాల్‌కోమ్‌ అడ్రెనో 730 జీపీయూను ఉపయోగించింది. అంతేకాకుండా గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌-పెన్‌ (S-Pen) ఫీచర్‌ను కూడా సపోర్ట్‌ చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని