స్మార్ట్‌ బెంచీ

విరామ సమయంలో ఆఫీసు గదిలోంచి ఆరు బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్‌ పంపించుకోవాల్సి ఉంది. లేదూ ఆటవిడుపు కోసం యూట్యూబ్‌ చూడాలని అనుకున్నాం.

Updated : 29 Dec 2021 04:24 IST

విరామ సమయంలో ఆఫీసు గదిలోంచి ఆరు బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్‌ పంపించుకోవాల్సి ఉంది. లేదూ ఆటవిడుపు కోసం యూట్యూబ్‌ చూడాలని అనుకున్నాం. కానీ ఫోన్‌లో ఛార్జింగ్‌ తగినంత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైర్‌లెస్‌గా ఫోన్‌ ఛార్జ్‌ చేసే వీలుంటే? పోనీ యూఎస్‌బీ కేబుల్‌తోనైనా ఛార్జింగ్‌ చేసుకునే వెసులుబాటుంటే? ఊహించుకోవటానికి బాగానే ఉంది గానీ ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా? స్మార్ట్‌ బెంచ్‌ ఉంటే ఇది సాధ్యమే. క్రొయేషియాకు చెందిన స్టియోరా కంపెనీ వీటిని తయారుచేసింది. మనదేశంలో కొన్ని ఆఫీసు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు కూడా. వీటితో వైర్‌లెస్‌గా ఫోన్లు ఛార్జ్‌ చేసుకోవచ్చు. యూఎస్‌బీతో ఛార్జ్‌ చేసుకోవటానికి అదనంగా రెండు పోర్టులు కూడా ఉంటాయి. ఈ బెంచీలు సాయంత్రం వేళల్లో లైట్లుగానూ ఉపయోగపడతాయి. వైఫై హాట్‌స్పాట్‌ సదుపాయమూ ఉంటుంది. మరి వీటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుందనేగా సందేహం. సౌర ఫలకాలతో తమకు తామే విద్యుత్తు తయారుచేసుకుంటాయి. ఏసీ విద్యుత్తుతోనూ పనిచేయించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని