యూఎస్‌బీ కేబుల్‌ తీస్తేల్యాప్‌టాప్‌ కిల్‌!

యూఎస్‌బీ కేబుల్‌ తీసేస్తే ల్యాప్‌టాప్‌ కిల్‌. అవును మీరు చదివింది నిజమే. ఇది మామూలు కేబుల్‌ కాదు మరి. ల్యాప్‌టాప్‌లోని సమాచారం దొంగల చేతికి చిక్కకుండా రూపొందించిన ప్రత్యేకమైన యూఎస్‌బీ కేబుల్‌. దీన్ని ల్యాప్‌టాప్‌కు తగిలించి ఉంచామనుకోండి. ఎవరైనా దాన్ని దొంగిలించి,

Updated : 22 Dec 2021 05:22 IST

యూఎస్‌బీ కేబుల్‌ తీసేస్తే ల్యాప్‌టాప్‌ కిల్‌. అవును మీరు చదివింది నిజమే. ఇది మామూలు కేబుల్‌ కాదు మరి. ల్యాప్‌టాప్‌లోని సమాచారం దొంగల చేతికి చిక్కకుండా రూపొందించిన ప్రత్యేకమైన యూఎస్‌బీ కేబుల్‌. దీన్ని ల్యాప్‌టాప్‌కు తగిలించి ఉంచామనుకోండి. ఎవరైనా దాన్ని దొంగిలించి, కేబుల్‌ను తొలగించారంటే వెంటనే ల్యాప్‌టాప్‌ లాక్‌ అయిపోతుంది. ఇది విండోస్‌, మ్యాక్‌ఓఎస్‌, లైనక్స్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లు అన్నింటిలోనూ పనిచేస్తుంది. లైనక్స్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లకు మరో అదనపు భద్రత కూడా ఉంది. ఈ కేబుల్‌ను తొలగిస్తే పరికరం లాక్‌ అవటమే కాదు.. మొత్తం డేటా అంతా క్రిప్టోగ్రఫీ రూపంలోకి మారిపోతుంది. అంటే దొంగలెవరూ దీన్ని యాక్సెస్‌ చేయలేని విధంగా మారిపోతుందన్నమాట. ఇందుకోసం దీనికి సంబంధించిన యాప్‌లో సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ల్యాప్‌టాప్‌ తెరచి ఉన్నప్పుడు ఎవరైనా దొంగిలించటానికి ప్రయత్నిస్తే మనమే చిటికెన వేలితోనే ఇట్టే యూఎస్‌బీని తొలగించొచ్చు కూడా. దీంతో సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా చూసుకోవచ్చు. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షకుల వంటివారి కోసం బస్‌కిల్‌ సంస్థ దీన్ని రూపొందించింది. సమాచారాన్ని ల్యాప్‌టాప్‌లో దాచుకొనే క్రిప్టోట్రేడర్లకూ ఉపయోగపడగలదని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని