MIUI 13: షావోమి కొత్త ఓఎస్... పది కొత్త ఫీచర్లు ఇవే!
ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు సంబంధించి కొత్త ఓఎస్ MIUI 13లో వచ్చే ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.. రండి!
ఇంటర్నెట్ డెస్క్: షావోమి కొత్త ఓఎస్ వెర్షన్ MIUI 13 త్వరలో అందుబాటులోకి రానుంది. తొలుత ప్రీమియం శ్రేణి మొబైల్స్‌లో ఈ ఓఎస్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12ఎక్స్, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 మొబైల్స్‌లో మొదట ఈ ఓఎస్ అందుబాటులోకి వస్తుంది. ఈ వెర్షన్ ఓఎస్ జనవరి 26 తర్వాత మన దేశంలో మొబైల్స్‌కు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో MIUI 13లో వచ్చే టాప్ 10 ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.. రండి!
- MIUI 13 బీటా వెర్షన్‌ను షావోమీ కొన్ని రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కొత్త ఓఎస్‌తో వచ్చే మొబైల్స్‌లో విజువల్స్. ప్రైవసీ పరంగా భారీ మార్పులే చేసింది.
- సూపర్ న్యూ లైవ్‌పేపర్స్, నోట్స్, క్లాక్, మినీ గేమ్స్ సంబంధించి డైనమిక్ హోం స్క్రీన్ విడ్జెట్స్, థీమ్స్‌తో కొత్త ఓఎస్ కలర్‌ఫుల్ రానుంది.
- సౌకర్యవంతమైన పఠనానికి సంబంధించి MIUI 13లో ‘MiSans’ అనే కొత్త ఫాంట్ తీసుకురానున్నారు. నైట్‌మోడ్‌లోనూ ఈ ఫాంట్ సౌకర్యవంతంగా ఉంటుందట.
- ‘షూట్ విత్ స్క్రీన్ ఆఫ్’ ఆప్షన్ ద్వారా స్కీన్ లాక్ పడినా... వీడియోలు రికార్డు వీలు కలుగుతోంది. కెమెరా ఆన్ చేసిన తర్వాత మూడు నిమిషాలకు స్క్రీన్ దానంతట అదే ఆఫ్ అవుతుంది.
- గ్యాలరీ యాప్‌లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫొటోలను చూసేందుకు ఆల్, కెమెరా వంటి అదనపు ఆప్షన్స్ రానున్నాయి. పాత ఫొటోలు చూసుకునేందుకు ఈజీ అవుతుంది.
- ప్రైవసీకి సంబంధించి ఫేస్ వెరిఫికేషన్ ప్రొటెక్షన్, డాక్యుమెంట్ వాటర్ మార్కింగ్, టెలికమ్యూనికేషన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
- స్పామ్ కాల్స్ విషయంలో ఈ ఓఎస్‌లో మార్పులు చేస్తున్నారట.హానికరమైన అప్లికేషన్లు, ఫైల్స్ బదిలీలకు తావులేకుండా ప్రైవసీ సెట్టింగ్స్ మార్పులు చేశారు.
- సెట్టింగ్స్‌లో బ్యాటరీ సేవింగ్, బ్యాలెన్స్, పర్ఫార్మెన్స్ ఫీచర్లు తీసుకొస్తున్నారు. అలాగే ఫైల్స్ ఎన్‌స్క్రిప్షన్, వన్ హండ్ మోడ్ కూడా ఉన్నాయి.
- స్మార్ట్ పరిరకాల కనెక్టివిటీ కోసం కొత్త యాప్ తీసుకొస్తున్నారు. ఎంఐ స్మార్ట్ హబ్ ద్వారా వాటితో ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం రానుంది.
- ఎప్పుడు ఏమి తినాలి, నీళ్లు తాగమని చెప్పే రిమైండర్లు MIUI 13లో తీసుకొస్తున్నారు. ఇకపై ఆ సేవల కోసం కొత్త యాప్‌లు అక్కర్లేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Crime News
పైసలివ్వనందుకు ప్రాణాలతో చెలగాటం