HP Laptops: గేమర్స్‌ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లివే! 

గేమర్స్‌ కోసం హెచ్‌పీ కంపెనీ ఒమెన్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. హెచ్‌పీ ఒమెన్ 16 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. 

Published : 07 Dec 2021 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌పీ కంపెనీ ఒమెన్‌ సిరీస్‌లో కొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హెచ్‌పీ ఒమెన్‌ 16 (HP Omen 16) పేరుతో తీసుకొస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లో థర్మల్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ఉపయోగించారు. దీనివల్ల ల్యాప్‌టాప్ మరింత నాజూగ్గా ఉండటమే కాకుండా, ల్యాప్‌టాప్‌ వేడెక్కకుండా మెరుగైన కూలింగ్ వ్యవస్థను అందిస్తుంది. మరి ఈ ల్యాప్‌టాప్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం. 

హెచ్‌పీ ఒమెన్‌ 16 ఫీచర్లు

ఈ ల్యాప్‌టాప్‌లో క్యూహెచ్‌డీ రిజల్యూషన్‌, 165 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 16.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఇంటెల్‌కోర్‌ ఐ7-11800హెచ్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. నివిడియా జీఈఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3070 గ్రాఫిక్ కార్డు ఇస్తున్నారు. 16జీబీ డీడీఆర్‌4 3200ఎమ్‌హెర్జ్‌ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఒమెన్‌ డైనమిక్‌ పవర్‌ టెక్నాలజీ సీపీయూ, జీపీయూల సామర్థ్యాన్ని అంచనావేసి రెండింటికి సమానంగా పవర్‌ను పంపుతుంది. గేమర్స్ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో ఆర్‌జీబీ యాంటి-ఘోస్టింగ్ కీబోర్డుతోపాటు కస్టమైజ్డ్‌ థీమ్స్‌ ఇస్తున్నారు. హెచ్‌పీ ఒమెస్‌ 16లో 83 వాట్‌హవర్‌ లిథియం-అయాన్‌ పాలిమర్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని హెచ్‌పీ తెలిపింది. 16 జీబీ ర్యామ్‌/1 టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,39,999. హెచ్‌పీ ఆన్‌లైన్‌ స్టోర్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని