Web Browser: డిఫాల్ట్‌ బ్రౌజర్‌ను మార్చుకోవడం ఎలాగో తెలుసా..?

ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది డిఫాల్ట్‌ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌కు బదులుగా ఇతర యాప్‌లు డౌన్‌లోన్‌ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వాట్సాప్‌లో వచ్చే లింక్‌ క్లిక్‌ చేస్తే మాత్రం..

Published : 06 Mar 2022 21:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది.. ఇదని ఏదీ లేదు సమాచారమేదైనా ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచం..! ఒక్క క్లిక్‌తో అన్నీ తెలుసుకోవచ్చు.. కారణం ఇంటర్నెట్‌ బ్రౌజర్‌.. దాదాపు ఆండ్రాయిడ్‌ మొబైల్స్ అన్ని ప్రస్తుతం డిఫాల్ట్‌గా గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో వస్తున్నాయి. శాంసంగ్‌, యాపిల్‌ వంటి వాటిల్లో మాత్రం సఫారీ, శాంసంగ్‌ ఇంటర్నెట్ బ్రౌజర్లు వాడుతున్నారు. అయితే.. లేఅవుట్‌, ఇంటర్నెట్‌ వేగం, ఇతర ఫీచర్లు, ప్రైవసీ పాలసీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది డిఫాల్ట్‌ బ్రౌజర్‌కు బదులు ఇతర బ్రౌజర్లు వినియోగిస్తున్నారు. ఇలా ఇతర బ్రౌజర్లతో ఇంటర్నెట్‌ యాక్సెస్‌కు వీలున్నప్పటికీ.. వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే లింక్‌లు క్లిక్‌ చేస్తే మాత్రం ప్రతీసారి మొబైల్‌తో వచ్చే డిఫాల్ట్‌ బ్రౌజర్‌లోకే వెళ్తుంటుంది. మరి ఈ డిఫాల్ట్‌ బ్రౌజర్‌ను మార్చుకోవడం ఎలాగో మీకు తెలుసా...?

* ఇందుకు తొలుత మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ‘సెట్టింగ్స్‌ (Settings)’ ఓపెన్‌ చేయండి.

ఆపై ‘యాప్‌ (Apps)’ మెనూలోకి వెళ్లి పైనే ఉన్న ఆప్షన్స్‌లో ‘డిఫాల్ట్‌ యాప్స్‌ (Default Apps)’పై క్లిక్‌ చేయండి.

ఇక్కడ ‘బ్రౌజర్‌ యాప్‌ (Browser App)’లోకి వెళ్లి మీరు డిఫాల్ట్‌గా వాడలనుకునే యాప్‌ను ఎంచుకోండి. అయితే, ఇంతకంటే ముందు ఆ బ్రౌజర్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక ఐవోఎస్‌ విషయానికొస్తే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెబ్‌ బ్రౌజర్‌ కోసం స్క్రోల్‌ చేయాలి. ఆపై డిఫాల్ట్‌గా బ్రౌజర్‌ను సెట్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని