Gmail: జీమెయిల్ యాక్సెస్ కోల్పోతే.. ఏం చేయాలి?
జీమెయిల్ యాక్సెస్ (ఐడీ, పాస్‌వర్డ్) కోల్పోతే ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న జీమెయిల్ (Gmail) సేవల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ మొబైల్ వాడాలంటే జీమెయిల్ ఖాతా తప్పనిసరి. గూగుల్ ఇతర సేవలు, డేటా, ఫైల్స్ యాక్సెస్, షేరింగ్‌కూ జీ-మెయిలే కీలకం. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్ లాక్ కావడం, యాక్సెస్ (ఐడీ, పాస్‌వర్డ్) కోల్పోవడం జరిగితే..?ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి ఇవీ ట్రై చేయండి.
* ఒకవేళ మీకు జీమెయిల్ ఐడీ గుర్తు లేనట్లయితే ఫోన్ నంబర్‌తో సైన్ఇన్ అవ్వండి. అలాగే ‘Forgot password’పై క్లిక్ చేసి ఫోన్ నంబర్‌తో పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవడం సులువైన మార్గం.
* పైపద్ధతి విఫలమైతే ఐఫోన్, ఐప్యాడ్‌లో నేరుగా గూగుల్ ఖాతాతో లాగిన్ కావడం ద్వారా జీమెయిల్‌ను పునరుద్ధరించవచ్చు. ఇక్కడ ఎటువంటి ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సిన పనిలేదు. కానీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ డివైస్‌లలో Google Authenticator యాప్‌ను ఉపయోగించి ఖాతాను తిరిగి యాక్సెస్ చేసుకోవచ్చు.
* జీమెయిల్ లాకైన సందర్భాల్లో సైన్‌ఇన్ చేయడానికి తరచూ వినియోగించే కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను వాడండి. అందులోనూ మీరు సాధారణంగా వినియోగించే క్రోమ్, సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించండి. జీమెయిల్ లాక్ కావడం కంటే ముందే ముఖ్యంగా మేనేజ్ గూగుల్ ఖాతాలోకి వెళ్లి సెక్యూరిటీలో రికవరీ ఇమెయిల్, ఫోన్ నంబర్ సెట్ చేసుకోవడం మేలు. తద్వారా పాస్‌వర్డ్ లాగిన్‌కు సంబంధించిన ఓటీపీ వివరాలను గూగుల్ రికవరీ ఇమెయిల్, నంబర్‌కు పంపే అవకాశం ఉంటుంది.
* అయినా ఖాతా రికవరీ కాకుంటే గూగుల్ మిమ్మల్ని పలు సెక్యూరిటీ ప్రశ్నలకు అడగవచ్చు. ఈ ప్రశ్నలను దాటవేయకుండా ఎక్కువ వాటికి సమాధానమిస్తూ వెళ్లండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ‘కేఎల్ రాహుల్, డికాక్ ఆరెంజ్ క్యాప్ పోటీదారులుగా ఉంటారు’
-
India News
IN PICS: పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ
-
World News
Helicopters Crash: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు: 9మంది అమెరికా సైనికుల దుర్మరణం
-
Politics News
Pawan Kalyan: కౌలు రైతుల కడగండ్లకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం: పవన్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ