Updated : 11/08/2021 14:12 IST

Game Mode: ఐఫోన్‌లో గేమింగ్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే ? 

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్లో ఎన్నిరకాల ఆండ్రాయిడ్ మోడల్స్‌ ఉన్నా..ఐఫోన్‌కి ఉండే క్రేజ్‌ వేరు. ఆండ్రాయిడ్ ఫోన్‌కి పోటీగా ఐఫోన్ కూడా యూజర్స్‌కి ఎన్నో రకాల కొత్త ఫీచర్లని ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో గేమ్స్‌ కోసం ప్రత్యేకంగా గేమింగ్‌ మోడ్ ఇస్తున్నారు. ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేసి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌, నోటిఫికేషన్స్‌ వచ్చినా స్క్రీన్ మీద కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోతాయి. దానివల్ల గేమ్ ఆడుతున్నప్పుడు ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు. పూర్తి ఏకాగ్రతతో గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. అలానే మొబైల్‌ పనితీరుకూడా మెరుగ్గా ఉంటుంది. కానీ ఐఫోన్‌లో గేమింగ్ మోడ్ లేకపోవడం వల్ల గేమ్స్ ఆడేప్పుడు మధ్యలో ఫోన్, మెసేజ్, నోటిఫికేషన్ వంటి వస్తే గేమ్‌ ఆగిపోతుంది. అందుకే ఎక్కువ మంది గేమర్స్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తారు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కంటే కూడా ఐఫోన్‌లోనే గేమింగ్ బావుంటుందనేది చాలా మంది గేమర్స్ వాదన. అందుకే యాపిల్ ప్రత్యేకంగా గేమింగ్ మోడ్ ఇవ్వకపోయినా ఐఫోన్ యూజర్స్‌ దానికో పరిష్కారం కనుగొన్నారు. దాన్నే గేమింగ్ మోడ్‌ అని పిలుస్తున్నారు. మరి ఐఫోన్‌లో గేమింగ్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

* ఇందుకోసం ముందుగా ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి ‘డోనాట్ డిస్ట్రబ్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో సైలెన్స్ సెక్షన్‌లో ‘ఆల్వేస్’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత కింద ఉన్న ‘అలో కాల్స్‌ ఫ్రం’ అనే సెక్షన్ ఓపెన్ చేసి అందులో ‘నో వన్’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 

* ఆ తర్వాత సిరి షాట్‌కర్ట్స్‌ ఓపెన్ చేసి అందులో ఆటోమేషన్‌ సెక్షన్‌లోకి వెళ్లి ‘క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పడు మరో విండో ఓపెన్ అవుతుంది.

* దాన్ని కిందకి స్క్రోల్‌ చేస్తే ‘యాప్‌’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోన్‌లోని యాప్‌లతో కూడిన జాబితా కనిపిస్తుంది. అందులో మీకు నచ్చిన గేమ్‌ని సెలెక్ట్‌ చేసి ‘డన్‌’పై క్లిక్ చేయాలి.

* సెర్చ్‌బార్‌లో ‘డో నాట్ డిస్ట్రబ్’ టైప్ చేస్తే యాక్షన్స్‌లో ‘సెట్ డొ నాట్ డిస్ట్రబ్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎనేబుల్ చేయాలి. తర్వాత బయటికొచ్చి ‘ఆస్క్‌ బిఫోర్ రన్నింగ్’ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే మీ ఐఫోన్‌లో గేమ్ మోడ్ రూపొందుతుంది.  

* ఎప్పుడైనా మొబైల్‌లో మీరు గేమ్ లాంఛ్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోలానే గేమ్ ఆడినంతసేపు ఎలాంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, నోటిఫికేషన్లు స్క్రీన్‌ మీద కనిపించవు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని