Telangana News: ట్రాఫిక్‌ చలాన్లపై డిస్కౌంట్‌.. మిగిలింది రెండు రోజులే!

ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ల ఆఫర్‌ త్వరలోనే ముగిసిపోనుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌

Updated : 29 Mar 2022 19:42 IST

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ల ఆఫర్‌ త్వరలోనే ముగిసిపోనుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో ఈనెల 31లోపు కట్టేందుకు వీలు కల్పించారు. దీనికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది. డిస్కౌంట్‌తో పెండింగ్‌ చలాన్లను కట్టేందుకు ఈనెల 1 నుంచి అవకాశం కల్పించారు. ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

తొలుత సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తినప్పటికీ క్రమంగా దాన్ని పరిష్కరించడంతో వాహనదారులు డిస్కౌంట్‌ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. డిస్కౌంట్‌తో కట్టేందుకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గడువు తీరిన తర్వాత భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని