ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేయాలి: మంద కృష్ణ

పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లును ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం,

Updated : 28 Nov 2021 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లును ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు దిల్లీలో డిసెంబరు 14న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జరుపుతున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ‘చలో దిల్లీ’పై కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. మాదిగ విద్యార్థులకు భవిష్యత్తులో బంగరుబాట వేసేందుకే రాజీలేని పోరు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. జాతీయ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాదిగ విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని