దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యం.. ఆ తర్వాతే మిగతావారికి: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాతే మిగతావారికి అవకాశమిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా ఖానాపురంలో గురువారం తెరాస ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 04 Mar 2022 07:14 IST

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం, న్యూస్‌టుడే: దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాతే మిగతావారికి అవకాశమిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా ఖానాపురంలో గురువారం తెరాస ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు ఎంపికలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తొలుత అర్హులైన తెరాస కార్యకర్తలకే ఇస్తామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే తెరాస అధికారంలో ఉండాలని.. అందుకోసం కృషి చేస్తున్న అర్హులైన పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు మొదట అందేలా చూస్తామని ఆయన స్పష్టంచేశారు. రెండు పడకగదుల ఇళ్ల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారని, దళితబంధు ఎంపికలను మాత్రం నేరుగా సీఎం కేసీఆర్‌ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు దళితులు తెరాసలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని