తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి సాహితీ పురస్కారాలు ప్రకటించింది.

Published : 22 Oct 2021 04:28 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి సాహితీ పురస్కారాలు ప్రకటించింది. పద్యకవితాప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన ‘శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధం’, వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్‌రాజు ‘కల ఇంకా మిగిలే ఉంది’, బాలసాహిత్యంలో సామలేటి లింగమూర్తి ‘పాటల పల్లకి’, కథానికా ప్రక్రియలో రావులపాటి సీతారామారావు ‘ఖాకీకలం’, నవలా ప్రక్రియలో డా.గడ్డం మోహన్‌రావు ‘కొంగవాలు కత్తి’, సాహితీ విమర్శలో డా.కిన్నెరశ్రీదేవి ‘సీమకథ అస్తిత్వం’, నాటికల్లో నారాయణబాబు ‘అశ్శరభశరభ’, అనువాదంలో సజయ ‘అశుద్ధ భారత్‌’, వచన రచనల విభాగంలో లక్ష్మణరావు ‘హైదరాబాద్‌ నుంచి తెలంగాణ దాక..’, రచయిత్రి ఉత్తమగ్రంథం విభాగంలోఉమాదేవి ‘రేలపూలు’ గ్రంథాలు ఎంపికయ్యాయని వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని