ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పునర్నియామకాలపై వ్యాజ్యం

డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో డైరెక్టర్‌, విభాగాధిపతుల పునర్నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డైరెక్టర్‌ పి.ప్రకాశ్‌రావు

Published : 28 Nov 2021 05:24 IST

డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో డైరెక్టర్‌, విభాగాధిపతుల పునర్నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డైరెక్టర్‌ పి.ప్రకాశ్‌రావు, డీన్‌ ఆఫ్‌ స్టడీస్‌-హెడ్‌ డాక్టర్‌ పి.గౌతమ్‌, సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ అబ్బాస్‌అలీలను తిరిగి నియమించడాన్ని సవాలు చేస్తూ పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్‌ ఇటీవల ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘65 ఏళ్లు నిండినా.. వారి పదవీ కాలాన్ని తిరిగి పొడిగించారు. పదవీ విరమణ చేసిన వారికి ఆశ్రయం కల్పించేలా ఇది ఉంది. ఈ పోస్టులకు బహిరంగ ప్రకటన జారీచేసి నియామకాలు ఎందుకు జరపడంలేదో తెలియడంలేదు. వారి నియామకాల దస్త్రాలను తెప్పించేలా ఆదేశించాలి’’ అని కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌తోపాటు వ్యక్తిగత హోదాలో ప్రకాశ్‌రావు, గౌతమ్‌, అబ్బాస్‌ అలీలను చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని