120 ఎకరాలు... రెండున్నర కోట్ల ఆదాయం

సాగులో రాణించాలంటే కష్టపడి పంట పండించడమే కాదు. పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోగలగాలి. వ్యవసాయాన్ని పరిశ్రమగా భావిస్తేనే సాగు లాభసాటిగా ఉంటుందనేది మార్కెటింగ్‌ నిపుణులు

Updated : 02 Dec 2021 05:18 IST

సాగులో రాణించాలంటే కష్టపడి పంట పండించడమే కాదు. పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోగలగాలి. వ్యవసాయాన్ని పరిశ్రమగా భావిస్తేనే సాగు లాభసాటిగా ఉంటుందనేది మార్కెటింగ్‌ నిపుణులు ఎప్పుడూ చెప్పే విషయం. వాతావరణం, నీటి లభ్యత, పంట దిగుబడి సమయాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు వెళితేనే విజయం తథ్యం. దేశంలో కొన్నిసార్లు ప్రకృతి రైతుకు శత్రువుగా మారినప్పటికీ ఎప్పటికప్పుడూ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొంటున్న అన్నదాతలే పెట్టుబడి నష్టం నుంచి తప్పించుకుంటున్నారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం మాత్రమే చేస్తే చాలదని, ఉత్పత్తిని మార్కెట్‌కు తరలించే వరకు పర్యవేక్షణ ఉంటేనే లాభసాటి సాగు సాధ్యమవుతుందని అనంతపురం జిల్లాలో ముగ్గురు రైతులు నిరూపించారు. వారికి తండ్రి నుంచి వారసత్వంగా పంచుకున్న 12 ఎకరాల భూమిలో సమష్టి వ్యవసాయం చేపట్టి 120 ఎకరాలకు అభివృద్ధి చేశారంటే వారి కష్టం సామాన్యమైనది కాదు. చక్కటి ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ 120 ఎకరాల్లో కేవలం దానిమ్మ, బత్తాయి, మునగ, ద్రాక్ష  వంటి నాలుగు రకాల ఉద్యాన పంటలే సాగుచేస్తూ ఏటా రూ.2.5 కోట్ల రూపాయల లాభం పొందుతున్నారు. కరవు నేలలో సిరులు పండిస్తున్న ఈ ముగ్గురు అన్నదమ్ములు  సాగులో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు? నీటి కొరత నివారణకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? పండించేది నాలుగు రకాల పంటలే అయినా వాటిని ఏయే కాలాల్లో పండించి గిట్టుబాటు ధరలు పొందుతున్నారు? పంటల సాగులో వైరస్‌లు, తెగుళ్ల నివారణకు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వాడకంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? పండిన పంటను మార్కెట్‌ చేసుకోవడంలో పాటిస్తున్న నూతన పద్ధతులు ఏమున్నాయి? తదితర సమగ్ర వివరాలను మీకందిస్తోంది డిసెంబరు ‘అన్నదాత’.

మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత డిసెంబరు-2021 సంచికలో...

‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9121157979, 8008522248 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని