నేపథ్య గాయని పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారం

అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా నేపథ్య గాయని పి.సుశీలకు ‘ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారం’ అందజేయనున్నట్లు నిర్వాహకులు

Published : 03 Dec 2021 05:46 IST

వేడుకలను ప్రారంభించనున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ  

ఈనాడు-హైదరాబాద్‌, రవీంద్రభారతి-న్యూస్‌టుడే: అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా నేపథ్య గాయని పి.సుశీలకు ‘ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారం’ అందజేయనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభిస్తారని వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, ఉపాధ్యక్షుడు కె.వి.రమణాచారి, ‘సంగమం ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు సంజయ్‌కిషోర్‌  తెలిపారు. ఘంటసాలతో అనుబంధమున్న సీనియర్‌ నటులు కృష్ణవేణి, జమున, మురళీమోహన్‌ తదితరులను సత్కరించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటల సంగీత విభావరి ఉంటుందని సంజయ్‌ కిషోర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని