సాహసం చేయరా.. కార్మికా!

చిత్రంలో కార్మికులు చేస్తున్న పనిని చూస్తే ఔరా..అనక తప్పదు. సైబరాబాద్‌ మధ్యలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్‌ కోసం పెద్ద పెద్ద భవనాలకు అడ్డు రాకుండా భూమికి దాదాపు 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన స్తంభాలకు విద్యుత్తు లైన్లు అనుసంధానించడానికి కార్మికులు వాటిని ఎక్కి పనిచేస్తున్నారు.

Published : 15 Jan 2022 06:30 IST

చిత్రంలో కార్మికులు చేస్తున్న పనిని చూస్తే ఔరా..అనక తప్పదు. సైబరాబాద్‌ మధ్యలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్‌ కోసం పెద్ద పెద్ద భవనాలకు అడ్డు రాకుండా భూమికి దాదాపు 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన స్తంభాలకు విద్యుత్తు లైన్లు అనుసంధానించడానికి కార్మికులు వాటిని ఎక్కి పనిచేస్తున్నారు. అంత ఎత్తయిన స్తంభంపై ఉంటే గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. ఆ ఎత్తులో పోల్‌కి అనుసంధానించిన రాడ్‌పై పాకుతూ విద్యుత్తు తీగలు లాగి నట్లు, బోల్టులు, జంపర్లు కింది నుంచి తాడు సాయంతో అందుకుని బిగించడం నిజంగా సాహసమే. ఇందు కోసం ముందుగా శిక్షణ ఇచ్చి, సంబంధిత వీడియోలు చూపించారని కార్మికులు తెలిపారు. స్తంభాలపైన ఉన్న వారితో వాకీటాకీలో మాట్లాడుతూ అవసరమైన సామగ్రిని పంపుతామని కింద పని చేస్తున్న కార్మికులు చెప్పారు. ఈ పనులు బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) నుంచి నానక్‌రాంగూడకు వెళ్లే మార్గంలో కనిపించాయి.  

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని