విశ్వస్థాయికి తెలంగాణ ఖ్యాతి

ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్‌ టూరిజం విలేజ్‌) పోటీలో

Updated : 19 Jan 2022 05:24 IST

ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్‌ పోచంపల్లి ఎంపిక గర్వకారణం:ముఖ్యమంత్రి కేసీఆర్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. పక్కన పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌

ఈనాడు, హైదరాబాద్‌- భూదాన్‌ పోచంపల్లి, న్యూస్‌టుడే: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్‌ టూరిజం విలేజ్‌) పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పురస్కారాన్ని పొందడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి వెళ్లిన 170 ప్రతిపాదనల్లో.. మన దేశం నుంచి మూడు గ్రామాలవి ఉన్నాయని, అందులో భూదాన్‌ పోచంపల్లి ఎంపికై అరుదైన ఘనత సాధించిందని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో ప్రదానం చేసిన గుర్తింపు పత్రాన్ని మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందజేసి పోచంపల్లి శాలువాతో సత్కరించారు. మంత్రితో పాటు పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌, ఇతర అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని