ప్రాధాన్య పథకాలకు పెద్దపీట

బడ్జెట్‌ పద్దులపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ శాఖల నుంచి అందిన  ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. సమగ్ర పరిశీలన అనంతరం ఆయా శాఖలతో ప్రత్యేకంగా సమావేశాలు

Published : 22 Jan 2022 05:07 IST

బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు షురూ

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ పద్దులపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ శాఖల నుంచి అందిన  ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. సమగ్ర పరిశీలన అనంతరం ఆయా శాఖలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 18వ తేదీకల్లా దాదాపు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, పురపాలక విద్య, వైద్యం-ఆరోగ్యం వంటి కీలక శాఖల ప్రతిపాదనలను మొదటగా అధ్యయనం చేస్తున్నారు. 2021-22లో శాఖలవారీ కేటాయింపులు, డిసెంబరు వరకు వ్యయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ నిధుల లభ్యత, కేటాయింపుల మధ్య సమతుల్యత పాటించేలా చూస్తున్నారు. సవరించిన అంచనాల్లో పెరుగుదలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సహా వివిధ పథకాలకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని