
Published : 22 Jan 2022 05:17 IST
అన్నదాతతో.. స్తంభాలాట
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి చెందిన ఎకరా పొలం పక్కనే విద్యుత్తు ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట ఈ రైతు పొలంలో అధికారులు 19 విద్యుత్తు స్తంభాలు పాతారు. మల్లారెడ్డి కొంతకాలం కిందట మృతిచెందడంతో ఎవరూ సమస్యను పట్టించుకోలేదు. ఇటీవల పొలం వద్దకు వచ్చిన ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఇది గమనించి అవాక్కయ్యారు. స్తంభాలను తొలగించాలని అధికారులను కోరానని, ఉపయోగం లేకపోయిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
- ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
Advertisement
Tags :