
Published : 29 Jan 2022 04:23 IST
తితిదే ట్రస్టులకు రూ.2 కోట్ల విరాళం
తిరుమల, న్యూస్‌టుడే: తితిదేకు చెందిన వివిధ ట్రస్టులకు ఇద్దరు దాతలు రూ.2 కోట్లను విరాళంగా అందజేశారని చెన్నై తితిదే స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. చెన్నైకి చెందిన ముని శ్రీనివాసులురెడ్డి తితిదే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన మరో అజ్ఞాత భక్తుడు తితిదే శ్రీవేెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు.
Tags :