Weather Forecast: ఉత్తర తెలంగాణకు ‘ఆరెంజ్‌’ హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పగలు కొన్నిచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మిరాస్‌పల్లి(వనపర్తి జిల్లా)లో

Updated : 23 Mar 2022 07:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పగలు కొన్నిచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మిరాస్‌పల్లి(వనపర్తి జిల్లా)లో 1.3, పెబ్చేరులో 1.1, పర్పల్లి(మహబూబ్‌నగర్‌)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా కాటారం(జయశంకర్‌ జిల్లా)లో 41.9, అత్యల్పంగా బజార్‌హత్నూర్‌(ఆదిలాబాద్‌)లో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వాతావరణశాఖ ఆరెంజ్‌ రంగు హెచ్చరిక జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని