Special Trains: 19 ‘హాలిడే ప్రత్యేక రైళ్లు’: దక్షిణ మధ్య రైల్వే

జోన్‌ పరిధిలో 19 ‘హాలిడే ప్రత్యేక రైళ్ల’ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. మొత్తం 19 రైళ్లలో ఒకరైలు (విజయవాడ-సికింద్రాబాద్‌)....

Updated : 13 Apr 2022 09:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: జోన్‌ పరిధిలో 19 ‘హాలిడే ప్రత్యేక రైళ్ల’ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. మొత్తం 19 రైళ్లలో ఒకరైలు (విజయవాడ-సికింద్రాబాద్‌) 12న (మంగళవారం) బయలుదేరింది. 13న ఐదు (హైదరాబాద్‌-నర్సాపూర్‌, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడటౌన్‌, సికింద్రాబాద్‌-బరంపురం), 14న ఆరు (నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-కాచిగూడ, తిరుపతి-సికింద్రాబాద్‌, కాకినాడటౌన్‌-తిరుపతి, నాందేడ్‌-తిరుపతి, బరంపురం-సికింద్రాబాద్‌), 15న మూడు (తిరుపతి-కాకినాడటౌన్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌), 16న ఒకటి (సికింద్రాబాద్‌-తిరుపతి), 17న మూడు (నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడటౌన్‌-వికారాబాద్‌, తిరుపతి-సికింద్రాబాద్‌) ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని