కొండాపూర్‌, ఖమ్మం ఆసుపత్రులకు వైద్య మంత్రి ప్రశంసలు

ఒకప్పుడు నెలకు కేవలం 20 కాన్పులు చేసిన కొండాపూర్‌ ప్రభుత్వ దవాఖానాలో ఇప్పుడు నెలకు 250 ప్రసవాలు జరుగుతుండటం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు.

Published : 19 May 2022 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు నెలకు కేవలం 20 కాన్పులు చేసిన కొండాపూర్‌ ప్రభుత్వ దవాఖానాలో ఇప్పుడు నెలకు 250 ప్రసవాలు జరుగుతుండటం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. గడిచిన 4 నెలల్లో ఈ ఆసుపత్రిలో 990 కాన్పులు చేయగా.. అందులో 559 సహజ ప్రసవాలు జరగడం గొప్ప విషయమన్నారు. సిజేరియన్‌ కాన్పులను 45 శాతం నుంచి 30 శాతానికి తగ్గించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరదాచారి, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఖమ్మంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనూ ఏప్రిల్‌లో 599 ప్రసవాలు జరిగితే అందులో 359 సహజ కాన్పులు కావడం ప్రశంసనీయమన్నారు. సహజ ప్రసవాలను 40 శాతం నుంచి 61 శాతానికి పెంచేందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్‌, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని