RS Praveen kumar: ఏ పార్టీకీ అమ్ముడుపోను

తాను ఏ రాజకీయ పార్టీకీ అమ్ముడుపోనని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 21 Jul 2021 08:11 IST

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఇంద్రవెల్లి, ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తాను ఏ రాజకీయ పార్టీకీ అమ్ముడుపోనని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్వేరోస్‌ ఆదిలాబాద్‌ జిల్లా నాయకుడు ఊషన్న గృహప్రవేశానికి హాజరైన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవతను దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఉట్నూరు మండలం లింగోజీతండాకు వెళ్లి అక్కడ మాజీ ఐఏఎస్‌ అధికారి తుకారం విగ్రహానికి, అనంతరం ఉట్నూరు దంతనపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వెళ్లి చదువు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తానన్నారు.


ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణకు ప్రభుత్వ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ దళిత, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి, ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ఆయన వినతికి అనుమతిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం అనంతరం ఆయనను గురుకుల బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని