Samatha Murthy: పెద్దలకు రూ.150.. చిన్నారులకు రూ.75

ముచ్చింతల్‌ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తులు, సందర్శకుల కోసం ప్రవేశ రుసుములను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుములు నిర్ణయించామన్నారు.

Updated : 17 Feb 2022 06:59 IST

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం దర్శన రుసుముల ప్రకటన

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ముచ్చింతల్‌ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తులు, సందర్శకుల కోసం ప్రవేశ రుసుములను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుములు నిర్ణయించామన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తామన్నారు. కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నందున ఈ నెల 19 వరకూ మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుందని వెల్లడించారు. 19 తరువాత ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులకు ప్రవేశాలు కల్పించనున్నారు.  సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల సువర్ణమూర్తి విగ్రహం దర్శనం, త్రీడీ మ్యాపింగ్‌ లేజర్‌ షో, ఫౌంటేన్‌ అందాలను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేం ఏర్పాటు సహా ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని