30 వరకు బీఎడ్‌ వెబ్‌ఆప్షన్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్‌(ఓడీఎల్‌) వెబ్‌ ఆప్షన్‌, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు.

Published : 27 Apr 2024 04:00 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్‌(ఓడీఎల్‌) వెబ్‌ ఆప్షన్‌, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి గాను బీఎడ్‌(ఓడీఎల్‌) ఆన్‌లైన్‌ వెబ్‌ ఆప్షన్‌ ఈ నెల 30 లోపు నమోదు చేసుకోవాలని విద్యార్థి సేవల విభాగం డైరక్టర్‌ డాక్టర్‌ ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు జాబితాను మే 8న విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.braouonline.in  లో లేదా ‌ www.braou.ac.in  లో సందర్శించి పరిశీలించుకోవాలని సూచించారు.

మే 3కు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష గడువు

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష 2023-24 విద్యా సంవత్సరానికి కామర్స్‌, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుం రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000 లతో మే 3లోగా చెల్లించాలన్నారు. పరీక్ష మే 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్‌ కేంద్రంలో కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో లేదా 04023680411/498/240 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని