జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలి

దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్‌ బోగీల సంఖ్యను ఐదుకు  పెంచాలని ‘జనరల్‌ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Published : 27 Apr 2024 04:06 IST

కోటి ఉత్తరాల ఉద్యమం

గిర్మాజీపేట, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్‌ బోగీల సంఖ్యను ఐదుకు  పెంచాలని ‘జనరల్‌ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్‌ చేశారు. జనరల్‌ బోగీల ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఆవరణలో శుక్రవారం కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమితి కన్వీనర్‌ అశోక్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా సరిపడా జనరల్‌ బోగీలు లేక తొక్కిసలాటలు సర్వసాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రధాని కార్యాలయానికి ఉత్తరాలు పంపించాలని సమితి సభ్యులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని