జెనెటిక్స్‌ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్‌

రాష్ట్రంలో జెనెటిక్స్‌ సంబంధిత కౌన్సెలింగ్‌ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్‌లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఆదేశించారు.

Published : 27 Apr 2024 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జెనెటిక్స్‌ సంబంధిత కౌన్సెలింగ్‌ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్‌లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఆదేశించారు. సుమారు 150 జెనెటిక్‌ క్లినిక్‌లు, సెంటర్ల ప్రతినిధులకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి నిబంధనలపై అవగాహన కల్పించారు. జెనెటిక్‌ సెంటర్ల నిర్వహణ, నిర్ధారణ పరీక్షలు, నివేదికలు అన్ని నిబంధనల మేరకే ఉండాలని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం నేపథ్యంలో జెనెటిక్‌ కేంద్రాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పీసీ మరియు పీఎన్‌డీటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు పరచాలన్నారు. జెనెటిక్‌ కేంద్రాల రిజిస్ట్రేషన్‌ అంశాన్ని ఇప్పటికే డీఎంహెచ్‌ఓల పరిధి నుంచి తప్పించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు