ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Published : 27 Apr 2024 04:04 IST

కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కమిషనర్‌ విలేకర్ల సమావేశంలో ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘‘ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ కేసులో నిందితులు తెలివైనవాళ్లు. ఆధారాల్ని మరుగుపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం మొత్తం సమాజం మీద జరిగింది. వ్యక్తుల గోప్యతకు సంబంధించిన దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. ‘‘ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసు ఇస్తాం. కానీ ఇచ్చేసినట్లు కొన్ని పత్రికల్లో రాశారు. ఈ కేసులో అవసరమైన సమాచారాన్ని అందిస్తాం’’ అని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని