మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది.

Published : 27 Apr 2024 05:44 IST

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు
నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేయటం ఇతరుల ప్రతిష్ఠను దెబ్బతీయటమే
కేటీఆర్‌పై వ్యాఖ్యలకు మంత్రి సురేఖకు ఈసీ హెచ్చరిక లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1న వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారాసపైన, మాజీ మంత్రి కేటీఆర్‌పైన చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై క్షేత్రస్థాయి నివేదిక పంపాల్సిందిగా ఈసీ ఈ నెల 11న తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాసింది. ఆయన 16న పంపిన నివేదికను పరిశీలించిన మీదట కేటీఆర్‌పై, ఇతర అంశాలపై సురేఖ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఈసీ స్పష్టం చేసింది. ‘‘వాస్తవాలను నిర్ధారించుకోకుండా, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలను చేయటం తగదు. మీరు కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. మరింత బాధ్యతాయుతంగా పదాలను ఎంపిక చేసుకుని మాట్లాడాలి. నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేయటం ఇతరుల ప్రతిష్ఠను దెబ్బతీయటమే. ఉత్తర్వులు, నోటీసులు జారీచేయటం ఎలా ఉన్నా మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఈసీ ఆ లేఖలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు