KTR: ‘ఇరవయ్యేళ్లలో కేటీఆర్‌ ప్రధాని అవుతారేమో’..: ఆశా జడేజా మోత్వాని

రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్‌ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అమెరికాలోని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని

Updated : 25 May 2022 09:42 IST

రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్‌ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అమెరికాలోని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని మంగళవారం ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ బృందం తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలను దావోస్‌ వేదికపై వివరిస్తూ దూసుకెళ్తోందన్నారు. మంగళవారం ఆమె తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయనతో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని