Bicycle: సైకిల్‌పై వెళ్లినా.. శిరస్త్రాణం మరవడు!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన తువ్వ రాయమల్లు గొర్రెల కాపరి. ఈయన ఇంటి నుంచి గొర్రెల మంద వద్దకు, ఇతరత్రా చిన్న అవసరాలకు ఎక్కడకు బయల్దేరినా శిరస్త్రాణం ధరించనిదే సైకిల్‌ తియ్యరు. దాదాపు

Updated : 07 Jun 2022 07:03 IST

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన తువ్వ రాయమల్లు గొర్రెల కాపరి. ఈయన ఇంటి నుంచి గొర్రెల మంద వద్దకు, ఇతరత్రా చిన్న అవసరాలకు ఎక్కడకు బయల్దేరినా శిరస్త్రాణం ధరించనిదే సైకిల్‌ తియ్యరు. దాదాపు నాలుగేళ్ల కిందట రాయమల్లు కుమారుడు ద్విచక్రవాహనం కొనుగోలు చేసినపుడు వచ్చిన హెల్మెట్‌ ఇంట్లో ఉండడంతో అప్పటినుంచి ఆయన క్రమం తప్పకుండా దాన్ని పెట్టుకునే సైకిల్‌పై వెళ్తున్నారు.  శిరస్త్రాణాన్ని పెట్టుకుని ఉంటే కింద పడినా తలకు గాయాలు కావని, వేసవిలో వడ దెబ్బ బారిన పడకుండా, శీతాకాలంలో చలి నుంచి రక్షణగా ఉంటుందని రాయమల్లు తెలిపారు. శిరస్త్రాణం ధరించేందుకు బద్దకించే ద్విచక్ర వాహనదారులు ఈయన్ను చూసి నేర్చుకోవాలి.

-న్యూస్‌టుడే, ధర్మారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని