నర్సింగ్‌లో అత్యవసర సేవలకు కొత్తగా ప్రత్యేక కోర్సు

నర్సింగ్‌ విద్యలో కొత్త కోర్సును భారత నర్సింగ్‌ మండలి ప్రవేశపెట్టింది. అత్యవసర చికిత్స విభాగం(క్రిటికల్‌ కేర్‌)లో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ‘పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ స్పెషాలిటీ నర్సింగ్‌-

Published : 05 Jul 2022 05:52 IST

ప్రవేశపెట్టిన భారత నర్సింగ్‌ మండలి

ఈనాడు, హైదరాబాద్‌: నర్సింగ్‌ విద్యలో కొత్త కోర్సును భారత నర్సింగ్‌ మండలి ప్రవేశపెట్టింది. అత్యవసర చికిత్స విభాగం(క్రిటికల్‌ కేర్‌)లో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ‘పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ స్పెషాలిటీ నర్సింగ్‌- రెసిడెన్సీ’గా పిలుస్తారు. ఈ కోర్సులో ఏడాది పాటు రెసిడెంట్‌ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 200 పడకలున్న ఆసుపత్రుల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణకు నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఐసీయూల్లో సమర్థ సేవలందించేందకు సుశిక్షితులైన నర్సులు అవసరమని చెప్పింది. క్రిటికల్‌ కేర్‌లో పనిచేసే నర్సు మానసిక, సామాజిక అంశాల పరంగా కుటుంబ అవసరాలను తీర్చడానికి కౌన్సెలింగ్‌ నైపుణ్యాలను కలిగి ఉండాలంది. ఏడాది రెసిడెన్సీ ప్రోగ్రాంలో 10 శాతం థియరీకి, 90 శాతం స్కిల్‌ ల్యాబ్‌, క్లినికల్‌ స్థాయిలో కోర్సుకు మార్కులుంటాయి. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారు ఈ ప్రత్యేక కోర్సుకు అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని