టీపీజేఏ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పోటీలు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం(టీపీజేఏ) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు జి.భాస్కర్‌ మంగళవారం తెలిపారు. ఉత్తమ వార్తాచిత్రం, ఎనిమిదేళ్లలో

Published : 06 Jul 2022 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం(టీపీజేఏ) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు జి.భాస్కర్‌ మంగళవారం తెలిపారు. ఉత్తమ వార్తాచిత్రం, ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో అభివృద్ధి, ప్రాచీన కట్టడాలు- పర్యాటక ప్రాంతాల వంటి మూడు కేటగిరిల్లో ఉత్తమ చిత్రాలను వచ్చే నెల అయిదో తేదీలోగా  tpja999@gmail.com కు రెండేసి ఫొటోల సాఫ్ట్‌కాపీలతో పాటు జర్నలిస్టు వివరాలను జత చేయాలన్నారు. పూర్తి వివరాలకు 8096677376 నంబరులో సంప్రదించాలని భాస్కర్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని