నేడు అతి భారీ వర్షాలు

రెండు ఉపరితల ఆవర్తనాలతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాష్ట్రంలో గురువారం అతి భారీ, శుక్రవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ బుధవారం

Published : 07 Jul 2022 06:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెండు ఉపరితల ఆవర్తనాలతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాష్ట్రంలో గురువారం అతి భారీ, శుక్రవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ బుధవారం మీడియాకు తెలిపింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల్లో అస్థిరత ఏర్పడి ఉత్తర భారత ప్రాంతమంతా 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లపై మరో ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని