తెలంగాణ.. అభివృద్ధికి నిదర్శనం

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల

Published : 16 Aug 2022 05:25 IST

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం ఆయన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు. మైదానానికి చేరుకున్న మంత్రి తొలుత జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాయన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే సదుద్దేశంతో 1.20 కోట్ల జెండాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఇచ్చినట్లు చెప్పారు. వీటి తయారీలో సుమారు రెండు వేల మంది నేత కార్మికులు పాలుపంచుకున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి 12 రాష్ట్రాల నుంచి జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని