కృష్ణాలో స్వల్పంగా తగ్గిన ప్రవాహం

కృష్ణా నదిలో ప్రవాహం స్వల్పంగా తగ్గింది. నాగార్జునసాగర్‌ వద్ద గురువారం రాత్రి సమయానికి ఇన్‌ఫ్లో 1.71 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు,

Updated : 19 Aug 2022 03:12 IST

 సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిలో ప్రవాహం స్వల్పంగా తగ్గింది. నాగార్జునసాగర్‌ వద్ద గురువారం రాత్రి సమయానికి ఇన్‌ఫ్లో 1.71 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, కాల్వలు కలిపి మొత్తం 1.78 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో 2.93 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1.94 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. రెండు రాష్ట్రాల జల విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి, మల్యాల-హంద్రీనీవా ఎత్తిపోతలకు కలిపి 2.62 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గోదావరిలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ దిగువన ప్రవాహం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని