Croronavirus: ‘1966లోనే కరోనా వైరస్‌’

తాను పరిశోధించి కరోనా వైరస్‌ను కనుగొన్న డాక్టర్‌ డోరతీ హమ్రే గురించి తెలుసుకోగలిగానని  బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ ఆచార్యులు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌   బలరాం

Updated : 25 Sep 2022 07:47 IST

తన మొదటి నివేదికలో ప్రచురించిన డాక్టర్‌ హమ్రే

ఈనాడు, హైదరాబాద్‌: తాను పరిశోధించి కరోనా వైరస్‌ను కనుగొన్న డాక్టర్‌ డోరతీ హమ్రే గురించి తెలుసుకోగలిగానని  బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ ఆచార్యులు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌   బలరాం చెప్పారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) 81వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగిన కార్యక్రమంలో ‘కరోనా వైరస్‌ యుగంలో రసాయన, జీవశాస్త్రాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు. వాస్తవానికి 1966 నాటికే కరోనా వైరస్‌పై హమ్రే మొదటి నివేదికను ప్రచురించారని తెలిపారు. దేశంలో ఫార్మారంగం అభివృద్ధికి సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌లు ఎనిమిది దశాబ్దాల్లో గణనీయమైన సహకారం అందించాయని ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

డాక్టర్‌ ఎస్‌.వెంకటమోహన్‌కు కలాం ఫెలోషిప్‌

ఎన్విరాన్‌మెంటల్‌ బయో ఇంజినీరింగ్‌లో తన పరిశోధనలకు ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌. వెంకటమోహన్‌ ప్రతిష్ఠాత్మకమైన అబ్దుల్‌ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్‌ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు, ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంయుక్తంగా ఫెలోషిప్‌ను అందజేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని