అలీ నివాసాన్ని ఇంజినీర్ల స్మారకంగా తీర్చిదిద్దాలి

ప్రఖ్యాత ఇంజినీరు నవాబ్‌అలీ జంగ్‌ బహదూర్‌ నివసించిన గృహాన్ని ఇంజినీర్ల స్మారక ప్రదేశంగా మార్చాలని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Updated : 07 Dec 2022 05:16 IST

జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రఖ్యాత ఇంజినీరు నవాబ్‌అలీ జంగ్‌ బహదూర్‌ నివసించిన గృహాన్ని ఇంజినీర్ల స్మారక ప్రదేశంగా మార్చాలని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. అలీ జంగ్‌ 73వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినం-2022ను హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఏడాది మరణించిన 71 మంది ఇంజినీర్ల (అన్ని శాఖలు) చిత్ర పటాలు ఏర్పాటు చేసి ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు నివాళులర్పించారు. అబేండ్కర్‌ వర్ధంతిని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ప్రకాశ్‌ మాట్లాడుతూ.. అలీ సాగునీటి రంగానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. సాగునీటి రంగం అభివృద్ధికి అంబేడ్కర్‌ రాసిన వ్యాసాలను కూడా తెలుగులోకి అనువదించాలని కోరారు. కార్యక్రమంలో ఈఎన్సీలు సి.మురళీధర్‌, అనిల్‌కుమార్‌, విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, చంద్రమౌళి, వెంకటేశం, రమణానాయక్‌, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని