Basara: బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్‌ ధరలు ఖరారు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో టికెట్ల ధరలను నిర్ణయించారు.

Updated : 08 Dec 2022 09:51 IST

విదేశీయులకు రూ.2,516 స్వదేశీయులకు రూ.1,516
అనుమతి కోసం కమిషనర్‌కు లేఖ

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో టికెట్ల ధరలను నిర్ణయించారు. దేశంలో నివసిస్తున్న వారితోపాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారికి పూజచేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టికెట్‌ ధరలు.. విదేశీయులకు రూ.2,516; మన దేశంలో ఉన్నవారికి రూ.1,516గా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానంగా ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం కావడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని ఏవిధంగా చేయాలి తదితర అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈఓ విజయరామారావు చర్చించారు. ఈ మేరకు ధరలను నిర్ణయించి అనుమతి కోసం కమిషనర్‌కు లేఖ రాశారు. అనుమతి రాగానే ఆన్‌లైన్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీపూజ, మూలానక్షత్రం, వేద ఆశీర్వచనం పూజలను కూడా చేయడానికి ఆలయాధికారులు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని