కోర్టు ధిక్కరణ కేసులో పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు
వైద్య కళాశాలల్లో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మమత ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్‌కు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈనాడు, హైదరాబాద్: వైద్య కళాశాలల్లో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మమత ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్‌కు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేసుకోవాలని, విద్యార్థుల నుంచి ఎక్కువ వసూలు చేసిన పక్షంలో వారి ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు ఆ సొమ్మును వాపసు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. మమత మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన తనకు ఆ ఆదేశాల ప్రకారం రూ.61.35 లక్షలు రావాల్సి ఉన్నా.. ఇంతవరకు అందలేదంటూ డాక్టర్ జి.నిఖిల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదిగా ఉన్న మమత ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..