వికారాబాద్-పర్లి వైజనాథ్ రైలుమార్గం విద్యుదీకరణ పూర్తి
వికారాబాద్-పర్లి వైజనాథ్ రైలు మార్గంలో చివరి దశ విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. 2018-19 సంవత్సరంలో 268 కి.మీ.ల మార్గాన్ని విద్యుదీకరించేందుకు రూ.244 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు మంజూరైంది.
తెలంగాణ-కర్ణాటక-మహారాష్ట్రలో కీలక మార్గం ఇది
ఈనాడు, హైదరాబాద్: వికారాబాద్-పర్లి వైజనాథ్ రైలు మార్గంలో చివరి దశ విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. 2018-19 సంవత్సరంలో 268 కి.మీ.ల మార్గాన్ని విద్యుదీకరించేందుకు రూ.244 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు మంజూరైంది. వికారాబాద్ నుంచి లాతూర్ రోడ్ వరకు ఇప్పటికే పూర్తి కాగా చివరి దశ లాతూర్ రోడ్-పర్లి వైజనాథ్‌ల మధ్య 63.75 కి.మీ.ల పనులు తాజాగా పూర్తయినట్లు ద.మ.రైల్వే ఆదివారం ప్రకటించింది. దీంతో ఈ మార్గంలో విద్యుత్తు ఇంజిన్లతో రైళ్లు నిరాటంకంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 90 కి.మీ, కర్ణాటక పరిధిలో 62 కి.మీ, మహారాష్ట్ర పరిధిలో 116 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. హైదరాబాద్ వైపు నుంచి ఔరంగాబాద్, శిర్డీ, పుణేల మధ్య రైళ్లను నడిపే ముఖ్యమైన మార్గం ఇది. మిషన్ ఎలక్ట్రిఫికేషన్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 100 శాతం విద్యుదీకరణ పనులకు ప్రాధాన్యం ఇస్తోంది. వికారాబాద్- పర్లి మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు ఎలక్ట్రికల్ విభాగం అధికారులను ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?