ఆధ్యాత్మిక కేంద్రంగా కళాధామం

యాదాద్రి క్షేత్రానికి సమీపంలో వివిధ కళారూపాలతో ఏర్పాటు చేసిన ‘కళాధామం’ అద్భుతంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రశంసించారు.

Published : 06 Feb 2023 03:21 IST

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి క్షేత్రానికి సమీపంలో వివిధ కళారూపాలతో ఏర్పాటు చేసిన ‘కళాధామం’ అద్భుతంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రశంసించారు. సురేంద్రపురిలో ఆధునికీకరించిన ప్రధాన ద్వారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. సొంత నిధులతో దేశంలోని ముఖ్యమైన ఆలయాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియం నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం ఇక్కడి హనుమదీశ్వరాలయం, కుందా సత్యనారాయణ కళాధామాన్ని ఆమె సందర్శించారు. కార్యక్రమంలో సురేంద్రపురి ఎండీ కుందా ప్రతిభ, డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని